కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరంపై ధనకొండ ఎస్సై విజయ్ కుమార్ ఆదివారం దాడులు నిర్వహించారు. దొనకొండ మండలంలోని నారపురెడ్డి పల్లె గ్రామ పొలాలలో కోడిపందాల శిబిరాలపై దాడులు నిర్వహించి నలుగురి వ్యక్తులను అరెస్టు చేసినట్లుగా ఎస్సై పేర్కొన్నారు. వారి వద్ద నుండి రెండు కోళ్లను, రెండు ద్విచక్ర వాహనాలను, నాలుగు మొబైల్ ఫోన్స్, రూ. 8, 560 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.