ప్రకాశం జిల్లా అర్ధవీడు ఎస్సైగా గురువారం సుదర్శన్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ అనిత గుంటూరుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ సుదర్శన్ గతంలో వి. ఆర్ ఉన్నారు. మండలంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తామని ఎస్ఐ సుదర్శన్ ఈ సందర్భంగా అన్నారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శన్ కు పోలీసు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.