ప్రకాశం జిల్లా బేస్తవారిపేట సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమయానికి కారులో బెలూన్లు తెరుచుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయటపడినట్లు శనివారం ప్రయాణికులు తెలిపారు. గిద్దలూరు నుంచి గుంటూరు వైపు కారు వెళుతున్న సమయంలో బేస్తవారిపేట వద్ద లారీ సడన్ బ్రేక్ వెయ్యడం వల్ల రోడ్డు ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు.