గిద్దలూరు మండలంలోని కృష్ణం శెట్టి పల్లె సమీపంలో ఒక కోళ్ల ఫామ్ షెడ్ దగ్గర ఆదివారం నాగుపాము సంచరిస్తుంది. అది గమనించి షెడ్డు యజమాని వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు తెలియపరిచారు. తురిమెళ్ళ ఎఫ్ఆర్ఓ మధు ప్రియాంక ఆదేశాల మేరకు డి ఆర్ ఓ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం ప్రసాద్ మౌలాలి అక్కడి చేరుకొని చాకచక్యంగా పాముని పట్టుకొని స్థానిక అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.