ప్రకాశం జిల్లా గిద్దలూరు సెయింట్ పాల్స్ కళాశాల సమీపంలో నీటి కుంటలో పడి హుస్సేన్ అనే బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. బాలుడు గురువారం స్నేహితులతో కలిసి ఈతకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బాలుడు మృతి పై తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ముమ్మాటికి తన కుమారుడిని చంపారంటూ ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం పోలీసులు వివరాలు వెల్లడిస్తామన్నారు.