వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య

76చూసినవారు
వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య
కంభంలో వివాహిత కమల (24) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఫ్యానుకు వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపట్టారు. వివాహిత కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఉరివేసుకున్నట్లుగా పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్