ప్రకాశం జిల్లా, మార్కాపురం మండలంలోని గొట్టిపడియ గ్రామ రహదారికి ఇరువైపులా పిచ్చిచెట్లు బాగా అల్లుకుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2కి.మీ మేర చిల్ల కంప ప్రయాణీకులను ఇబ్బందులు పెడుతుంది. విషయం తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకులు ఒంటెద్దు చిన్న రంగారెడ్డి, వాటిని తొలగించేందుకు ముందుకు వచ్చారు. తన స్వంత నిధులు రూ. 20 వేలు ఖర్చు చేసి సోమవారం చిల్లకంప తొలగించారు.