
ప్రకాశం జిల్లాలో మోదీ చేతుల మీదగా ప్రారంభోత్సవం
ప్రకాశం జిల్లాలో బుధవారం వివిధ పనులకు ప్రధాని మోదీ విశాఖ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. దోర్నాల-కుంట జంక్షన్ రూ. 245 కోట్లు, వెలిగోడు-నంద్యాలరూ. 601 కోట్లు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుడతారు. అలాగే రూ. 108 కోట్లతో గిద్దలూరు-దిగువమెట్ట రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు భూమి పూజ చేస్తారు. రూ. 907 కోట్లతో పూర్తి చేసుకున్న 6 వరుసల చిలకలూరిపేట బైపాస్ ను ప్రారంభిస్తారు.