

కంభం: అధికారి వేధింపులపై సిబ్బంది నిరసన
కంభం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పరిశోధన విభాగం ఉద్యోగులు బుధవారం నిరసనకు దిగారు. 6 నెలల క్రితం ఇన్ ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పన్నీరు వెంకట రమణయ్య ప్రవర్తనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. విధులు చేపట్టినప్పటి నుంచి తోటి ఉద్యోగులను సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నట్లుగా వారు ఆరోపించారు. మద్యం సేవించి మరి విధులకు హాజరవుతున్నట్లు వారు చెప్పారు.