తక్కువ మొత్తంలో పెట్టుబడులు, ఎక్కువ మొత్తంలో ఆదాయాల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కనిగిరి డిఎస్పి రామరాజు కోరారు. శుక్రవారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు, యాప్‌లు, వాట్సాప్ గ్రూప్‌లు, టెలిగ్రామ్ ఛానెల్‌లు, కంపెనీ బ్రాండ్‌ను పోలిన వెబ్సైట్లను రూపొందించి సైబర్ మోసగాళ్లు పేట్రేగిపోతున్నారని అన్నారు. వాటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.