కనిగిరి: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

75చూసినవారు
కనిగిరి: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కనిగిరి పట్టణంలోని స్థానిక దొరువు బజారులో కొలువై ఉన్న శ్రీ గోవిందా మాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో సోమవారం రాత్రి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి, గోవింద మాంబకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి విశ్వరూప చారి భక్తులను ఆశీర్వదించారు. దేవస్థానం కమిటీ వారు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్