ఉరకలెత్తుతున్న భైరవకోన వాటర్ ఫాల్స్
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భైరవకోన లోని వాటర్ ఫాల్స్ భారీ వర్షపు నీటితో ఉరకలెత్తుతుంది. చంద్రశేఖరపురం మండలంలోని బైరవకోన లో జలకలను సంతరించుకుంది. చాలా రోజుల తర్వాత భైరవకోనలో వాటర్ ఫాల్స్ నిండుకుండను తలపిస్తూ అద్భుతంగా చూపరులను ఆకట్టుకుంటుంది. అక్కడ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.