
టంగుటూరులో రోడ్డు ప్రమాదం ఒకరికి గాయాలు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని వల్లూరు జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళ ఒంగోలుకు చెందిన వనజగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ మహిళను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదం పై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.