
కొండేపి: అగ్ని ప్రమాదాలపై అవగాహన
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం కొండేపి మండలంలోని అనుమర్లపూడిలో ఓ పాఠశాల ఫైర్ ఆఫీసర్ వెంకటరావు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గృహాల్లోని వంట గదిలో గ్యాస్ ప్రమాదాలు జరిగితే ఎలా స్పందించాలనే విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు.