
సింగరాయకొండలో వ్యక్తి అదృశ్యం
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలో తాటిపర్తి జగన్ అనే వ్యక్తి మద్యానికి డబ్బులు ఇవ్వలేదని అలిగి ఫిబ్రవరి 21వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు తమ ప్రాంతాలలో అన్వేషించి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేసి అదృశ్యమైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఎవరన్నా జగన్ ను గుర్తిస్తే 7075993909 నంబర్ ను సంప్రదించి సంచారం ఇవ్వాలని కుటుంబం సభ్యులు తెలిపారు.