పొదిలి: విజయవంతమైన రైల్ టెస్ట్ డ్రైవ్

80చూసినవారు
పొదిలికి బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు గూడ్స్ రైలును విజయవంతంగా నడిపారు. కురిచేడు నుంచి దర్శి మీదుగా పొదిలికి ఈ గూడ్స్ రైలు వచ్చింది. కనిగిరి మీదుగా నడికుడికి రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు కొంతకాలంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం పొదిలి వరకు రైల్వే ట్రాక్ పనులు పూర్తయ్యాయి. దశాబ్దల కాలం నుంచి రైలు కోసం స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. నేటితో అ కోరిక నెరవేరిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్