మార్కాపురం పట్టణంలోని భాష్యం పాఠశాలలో మంగళవారం ముందస్తు విజయదశమి వేడుకలు ప్రిన్సిపాల్ కేవి.నాగరాజు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ముందుగా విద్యార్థినీలు దుర్గాదేవి వేషధారణలో చేసిన ప్రత్యేక నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్,ఉపాద్యాయులు విజయదశమి ప్రాముఖ్యతను విద్యార్ధులకు వివరించారు. కార్యక్రమంలో లిటిల్ చాంప్స్ ప్రధానోపాధ్యాయురాలు హేమసుధ, ఉపాద్యాయులు పాల్గొన్నారు.