కంభంలోని సిఎల్ఆర్ జూనియర్ కళాశాలలో శనివారం నాడు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సయ్యద్ షా అలీ భాష మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. సిఎల్ఆర్ జూనియర్ కళాశాల డైరెక్టర్ శిరిగిరి బ్రహ్మం మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి సకాలంలో వర్షాలు పడేలా రైతుల ముఖంలో చిరునవ్వు కనిపించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పెంచి పోషించాలన్నారు.