ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. వైసిపి కౌన్సిలర్లు టిడిపి చేరిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాజీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకొని బుద్ధిగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు.