ప్రకాశం జిల్లా మార్కాపురం ఎక్సైజ్ కానిస్టేబుల్ శంకర్ నాయక్ యర్రగొండపాలెం ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులపై సంచలన ఆరోపణలు చేశారు. సెలవు అడిగేందుకు వెళ్లిన తనపై కులం పేరుతో దూషించి అన్యాయంగా కేసు పెట్టారంటూ మీడియాకు శనివారం తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నత అధికారులు దర్యాప్తు జరిపి తనకు న్యాయం జరిగేలా చూడాలని శంకర్ నాయక్ ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేశాడు.