ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు శుక్రవారం బూత్ కన్వీనర్లతో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రతి వార్డులో టిడిపి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.