ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయం నందు శనివారం తాపీ మేస్త్రీల సంఘం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం నాయకులు అందే నాసరయ్య మరియు తాపీ మేస్త్రిల సంఘం అధ్యక్షులు రామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే భవన కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక ఇస్తామన్నారు కానీ నేడు గతం కంటే ఎక్కువ ధరలకు ఇసుక అమ్ముతున్నారని విమర్శించారు.