జిల్లాలో 62 మంది ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ నెల 5వ తేదీన ఒంగోలులోని కలెక్టరేట్ లో జరిగే గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రధానం చేయనున్నారు. ఎంపికైన వారిలో 19 మంది హెచ్ఎంలు, 20 మంది స్కూల్ అసిస్టెంట్లు, 25 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, నలుగురు పీజీటీలు, ముగ్గురు ఉర్దూ టీచర్లు ఉన్నారని బుధవారం తెలిపారు.