ఒంగోలులోని కర్నూలు రోడ్డులో స్టేట్ బ్యాంక్ ఆవరణలో మాజీ మిలిటరీ ఆఫీసర్ల ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. బ్రిటిష్ పాలనలో అరాచకం, అమానుషం నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు అని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మిలటరీ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.