ఒంగోలు నియోజకవర్గంలో 21 మందికి సీఎం సహాయ నిధి నుండి రూ. 54 లక్షలు మంజూరయ్యాయి. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తన నివాసంలో లబ్ధిదారులకు శనివారం ఆ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ ఆరోగ్య సమస్యల కారణాల వల్ల ఆసుపత్రులలో వైద్య సహాయం పొందుతున్న, వైద్య ఖర్చులు భారమై, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తుందన్నారు.