పోషణపై జాగ్రత్తలు పాటించాలి

83చూసినవారు
పోషణపై జాగ్రత్తలు పాటించాలి
వేసవికాలంలో పశువుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా, పశుసంవర్ధక శాఖ అధికారి బేబీ రాణి సూచించారు. శనివారం నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలు గ్రామంలో పశు వైద్య కేంద్రాన్ని సందర్శించి స్థానిక పాడి రైతులతో ఆమె మాట్లాడారు. నల్లజాతి పశువులు మేత వేసవికాలంలో తక్కువగా తినటం వల్ల పాల దిగుబడి తగ్గుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్