ఘోరం.. బాలిక తల నరికి ఉరేసుకున్న వరుడు

3979చూసినవారు
ఘోరం.. బాలిక తల నరికి ఉరేసుకున్న వరుడు
కర్ణాటకలోని కొడుగు జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మీనా (16) అనే బాలికను.. ప్రకాశ్‌ (32)కు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించారు. గురువారం నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, బాలికకు ఈ పెళ్లి ఇష్టం లేదని అధికారులను ఆశ్రయించింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రకాష్ బాలిక ఇంటికి వెళ్లి మీనా తల్లిదండ్రులపై దాడి చేసి .. బాలికను అడవిలోకి ఎత్తుకెళ్ళి తల నరికి చంపేశాడు. అనంతరం ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రకాశ్‌ కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్