క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల 21న పుల్లలచెరువు మండల కేంద్రంలోని తెలుగు బాప్టిస్ట్ మందిరంలో క్రీస్తు గీతాల పోటీలను నిర్వహిస్తున్నట్లు మండల పాస్టర్స్ ప్రవేశపెట్టి అధ్యక్షులు రెవరెండ్ ఆర్. ఆనందరావు సోమవారం తెలిపారు. ఆసక్తి కలవారు క్రిస్మస్ గీతాల పోటీలలో పాల్గొనాలని కోరారు. అదేవిధంగా బైబిల్ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.