ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ షేక్ ఖాసిం ఉత్తమ అవార్డు అందుకున్నారు. గురువారం జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్టేషన్ పరిధిలో చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర మంత్రి డోల వీరాంజనేయ స్వామి మరియు జిల్లా ఎస్పీ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు. తోటి సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.