పుల్లలచెరువు మండల కేంద్రం నుండి యర్రగొండపాలెం వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారడంతో ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యపై దృష్టి సారించిన మండల కూటమి నాయకులు సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లి రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయింప జేయడంతో రోడ్డుపై ఉన్న గుంతలను చదును చేసి మరమ్మతు పనులు చేస్తున్నారు. దీంతో మండల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.