ఓంకార క్షేత్రంలో ఘనంగా రాహుకేతు దోష నివారణ పూజలు

66చూసినవారు
ఓంకార క్షేత్రంలో ఘనంగా రాహుకేతు దోష నివారణ పూజలు
మంగళవారం పంచమితో పాటు ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా కొత్తపేటలోని ఓంకార క్షేత్రంలో రాహు, కేతు గ్రహాల దోష నివారణ పూజలు జరిగాయి. ఆలయ పూజారి కారంచేటి నగేష్ కుమార్ పంచామృతాభిషేకాలు, పూజాదికాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తుల గోత్రనామాల పేరిట రాహు కేతు దోషపరిహారం జరిగేలా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ, ప్రసాద వితరణ జరిగింది.

సంబంధిత పోస్ట్