ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్. దామోదర్ ను ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం కలిశారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో వీరు ఇరువురు ఎస్పిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి బోకేను అందజేశారు. అనంతరం జిల్లాలో ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతపై చర్చించారు.