ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

66చూసినవారు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మంగళవారం దర్శి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో దర్శి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావు ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్