దర్శి లోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు 100 పరుపులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఆమె తన సొంత నిధులతో విద్యార్థుల కోసం 100 పరుపులను పంపిణీ చేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు గాను పరుపులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.