దొనకొండలో శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జ్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి వీరు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మీ మాట్లాడుతూ మహానటుడిగా, ప్రజా నాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శక్తిమంతుడని కొనియాడారు.