TG: CPI MLA కూనంనేని సాంబశివరావు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్తో పొత్తులు శాశ్వతం కాదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో CPI అభ్యర్థులు సొంతంగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. సూర్యుడు ఉన్నంతకాలం CPI సజీవంగా ఉంటుందని, పార్టీని అభిమానించేవారు గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కమ్యూనిస్టు పార్టీని వాడుకొని మోసం చేశాయని, మోసపోవడం కమ్యూనిస్టుల వంతైందని కూనంనేని మండిపడ్డారు.