రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు: వ్యవసాయ శాఖ అధికారి
రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో రైతులకు శనగ విత్తనాలను అందిస్తుందని గురువారం గిద్దలూరు వ్యవసాయ శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. రెండు రకాల శనగ విత్తనాలను రైతులకు ప్రభుత్వం అందిస్తుందని ఎకరాకు 40 కేజీలు చొప్పున 5 ఎకరాల వరకు రైతులు సబ్సిడీపై పొందవచ్చని అన్నారు. శనగ విత్తనాలు పొందాలనుకునే రైతులు మీ స్థానిక రైతు సేవా కేంద్రాలకు వెళ్లి సంప్రదించాలని ఆయన రైతులకు సూచించారు.