వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, యాచకులకు చీరల పంపిణీ

1425చూసినవారు
వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, యాచకులకు చీరల పంపిణీ
వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు యాచకులకు చీరల పంపిణీ, ఈస్టర్ పండగ సందర్భంగా బేస్తవారిపేట పట్టణంలో దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు శ్రీ పోలూరి వెంకట స్వామి వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, యాచకులకు, 50 మందికి చీరలు జాకెట్లు పంపిణీ చేయడం జరిగినది. వెంకట స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఇతరులకు సహాయ పడుతూ నిరాశకు, నిస్పృహకు లోను కాకుండా ముందుకు వెళుతూ నా చుట్టూ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ సమాజానికి తన వంతు ఎంతో కొంత చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. రోడ్లపై భిక్షాటన చేస్తూ కనిపించినా వృద్ధులకు , వితంతువులకు, యాచకులకు, దివ్యాంగులకు, తానే స్వయంగా చీరలు, జాకెట్లు, పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పేరాజిఎం సంఘ పెద్దలు జూలీఎస్ సీజర్ , ప్రకాష్ , తిమోతి , పౌల్ , తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్