కంభం: తన బిడ్డను చూసి రోధించిన గోమాత

74చూసినవారు
కంభం: తన బిడ్డను చూసి రోధించిన గోమాత
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం గుర్తుతెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో ఆవు దూడ మృతి చెందింది. తల్లి ఆవు ఆవు దూడ వద్ద చాలాసేపు రోదిస్తూ అక్కడే ఉంది. ఈ సంఘటనను చూసిన స్థానికులు తల్లి ఆవు బాధ చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవుల సంరక్షకులు తమ ఇళ్ల వద్ద ఆవులను సంరక్షించుకుంటే ఇటువంటి సంఘటనలు జరగవని అన్నారు. పంచాయతీ అధికారులు ఆవు దూడను అక్కడి నుంచి తొలగించారు.

సంబంధిత పోస్ట్