కొమరోలు: పులి వాగును పరిశీలించిన జాయింట్ కలెక్టర్

71చూసినవారు
కొమరోలు లోని పులి వాగును జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. మండలంలోని సూరవారి పల్లి, బాదినేనిపల్లి, గుంతపల్లి పరిసర ప్రాంతాలలో పులి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. వాగును పరిశీలించిన జాయింట్ కలెక్టర్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను కారణంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్