సీజనల్ వ్యాధులతో అప్రమత్త మైన అధికారులు

80చూసినవారు
కొమరోలు మండలం చింతలపల్లి గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలడంతో మంగళవారం అధికారులు అప్రమత్తమయ్యారు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న 8 మందిని అధికారులు పరీక్షించారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కొమరోలు మెడికల్ ఆఫీసర్ చైతన్య దీపక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్