రాచర్ల: రామన్న కత్తువ కాలువకు గండి

70చూసినవారు
రాచర్ల: రామన్న కత్తువ కాలువకు గండి
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట వద్ద రామన్న కత్తువ సప్లై ఛానల్ కాలువకు బుధవారం గండి పడింది. దీంతో నీరంతా వృధాగా పోతుంది. సంబంధిత అధికారులకు స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని గండిని పరిశీలించారు. సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామస్తులు మాత్రం 3 సంవత్సరాలుగా కాలువకు పలుమార్లు గండి ఏర్పడిందని అధికారులు శాశ్వత పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్