కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా

72చూసినవారు
కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా
కోరం లేకపోవడంతో సింగరాయకొండ మండల సర్వసభ్య సమావేశం సోమవారం వాయిదా పడింది. మండలంలో ఎంపీటీసీ సభ్యులు 19 మంది ఉన్నారు. సర్వసభ్య సమావేశానికి తప్పనిసరిగా 10 మంది ఎంపీటీసీలు తగ్గకుండా హాజరుకావాలి. కానీ సమావేశానికి ఎంపీపీ కట్టా శోభారాణి, వైస్ ఎంపిపి షేక్ షకీలా, శానంపూడి ఎంపీటీసీ ఆదిపోగు సుమతి మాత్రమే హాజరు కాగా మిగిలిన సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో సమావేశాన్ని మంగళవారానికి వాయిదా వేశామని ఎంపీడీఓ తెలిపారు.

సంబంధిత పోస్ట్