ప్రకాశం జిల్లా కారుమంచిలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న బాలికపై టీచర్ అత్యాచారానికి యత్నించాడు. సుధాకర్ అనే టీచర్ బాలిక ప్రైవేట్ పార్ట్‌పై చేతులతో తాకి గాయపర్చాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు రానివ్వకుండా బాలిక కుటుంబాన్ని నిందితుడు బెదిరించినట్లు తెలుస్తోంది.