సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో రాజమండ్రికి చెందిన షేక్ జానీ(40) మృతి చెందాడని ఎస్సై శ్రీరామ్ ఆదివారం తెలిపారు. 5 సంవత్సరాల క్రితం వలస వచ్చి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ రొయ్యల పరిశ్రమంలో కూలీగా పని చేస్తున్నాడన్నారు. రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టడంతో అదే వాహనం ముందు చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.