పాకల బీచ్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి

1027చూసినవారు
పాకల బీచ్‌లో వ్యక్తి అనుమానాస్పద మృతి
సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి 7 గంటల సమయంలో సముద్రం ఒడ్డున మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కందుకూరుకు చెందిన కొత్తూరి వెంకటేశ్వర్లు (45)గా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. సింగరాయకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్