టంగుటూరు: పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్

78చూసినవారు
టంగుటూరు: పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో సోమవారం పేకాట ఆడుతున్న 8 మందిని స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ. 27, 440 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎస్సై నాగమల్లేశ్వరరావు అన్నారు.

సంబంధిత పోస్ట్