కొనకలమిట్ల: 29 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు

60చూసినవారు
కొనకలమిట్ల: 29 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు
ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలంలోని పలు గ్రామాలలో సోమవారం విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా విద్యుత్ వినియోగించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తున్న 29 మందిపై కేసు నమోదు చేసి రూ. 69 వేలు అపరాధ రుసుము విధించామని ఒంగోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హైమావతి తెలిపారు. తనిఖీలలో 72 మంది సిబ్బంది పాల్గొనట్లుగా ఆమె చెప్పారు. విద్యుత్తు చౌర్యానికి పాల్పడడం నేరమని హైమావతి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్