ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం రాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులకు టూ టౌన్ ఎస్ఐ రాజమోహన్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత వారికి జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని ఇక మద్యం తాగి అస్సలు వాహనాలు నడపనే రాదని తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే భారీ జరిమానలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని ఎస్ఐ వారిని తీవ్రంగా హెచ్చరించారు.