మార్కాపురం: పలకల పరిశ్రమపై అసెంబ్లీలో చర్చ

74చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో పలకల పరిశ్రమల సమస్యలపై మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. పలకల పరిశ్రమపై జీఎస్టీ విధించడం వల్ల ఆ రంగం పూర్తిగా కుంటుపడిందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. పలకల రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కృష్ణంరాజు మార్కాపురం పలక చాలా ఫేమస్ అని మార్కాపురం పలకను కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్